Amaravati farmers march: అమరావతి రైతుల మహా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ప్రారంభమైంది. 32వ రోజు యాత్రను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూగురుపల్లి శేషారావు విశాలాక్షి దంపతులు ప్రారంభించారు. అమరావతి ఐకాసనాయకులు శివారెడ్డి, తిరుపతిరావు , రైతులు పూజల్లో పాల్గొన్నారు. స్థానికులు భారీగా తరలివచ్చి రైతులకు మద్దతుగా నిలిచారుచారు. అమరావతి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం32వ రోజు పాదయాత్ర ముందుకు సాగింది.
స్వాగత ఫ్లెక్సీలు: మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తూర్పుగోదావరి జిల్లాలోనూ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు యాత్రికులకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు మరోవైపు నిరసన తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వాగత ఫ్లెక్సీలు తోపాటు ఆకుపచ్చ రంగు బెలూన్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
నిరసన తెలుపుతూ ఫ్లెక్సీలు: పాదయాత్ర చేస్తున్న రైతులకు నిరసన తెలుపుతూ వైకాపా ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు ఆంధ్ర స్టేట్ ముద్దు మూడు రాజధానులకే మా మద్దతు వంటి నినాదాలు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో రైతులకు వివిధ పథకాల కింద అందించిన లబ్ధి వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండల రైతులు ఏర్పాటు చేసినట్లుగా ఫ్లెక్సీలు వెలిశాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జరిగిన నిరసనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
32వ రోజు 15 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర: అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర 32వ రోజుకు చేరింది. 32వ రోజు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం నుంచి యాత్ర ప్రారంభమై మోర్త, దమ్మెన్ను గ్రామాల మీదుగా వేలివెన్ను చేరుకుంటుంది. వేలి వెన్నులో రైతులు భోజనం విరామం తీసుకుంటారు. భోజనం విరామానంతరం వేలివెన్ను నుంచి పెరవలి మండలం నడిపల్లి కోట కానూరు మీదుగా నిడదవోలు మండలం మునిపల్లి చేరుకుంటుంది. మునిపల్లి లో రాత్రి బస చేస్తారు. 33 వ రోజు రేపు మునిపల్లి నుంచి చాగల్లు మండలం ఎస్ ముప్పారం వరకు యాత్ర కొనసాగుతుంది. దాదాపు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
ఇవీ చదవండి: