అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఫోటోలు తీశారని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఉత్తరకంచి గ్రామానికి చెందిన మంతిన వెంకటరమణ అలియాస్ శ్రీను ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. పర్యావరణానికి సంబంధించిన పరిశోధనల్లో భాగంగా గంధం మరిడయ్య, ఉమ్మిడి విజయ్ ప్రసాద్, సుంకర సోమరాజుతో కలిసి ఊరకొండకు వెళ్లాడు. అప్పటికే అక్కడ రెండు జేసీబీలు, పొక్లెయిన్లతో గ్రావెల్ పనులు జరుగుతున్నాయి. ఈ దృశ్యాలు శ్రీను చిత్రీకరించాడు. ఇంతలో అక్కడ ఉన్న నరసింహమూర్తి, చక్రధర్ ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు శ్రీను ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయపడిన శ్రీనివాస్‌కి ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఎస్పీ కల్పించుకొని తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి...