తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దీనివల్ల జిల్లాలో అంతర్భాగమైన యానాం ప్రాంతం అధికారులు అప్రమత్తమయ్యారు. చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేయాలని డిప్యూటి కలెక్టర్ శివరాజ్ మీనా సూచించారు. ఇకపై యానాంలోకి వచ్చే వారందరూ చేతులు శుభ్రం చేసుకోవాలి, శానిటైజర్లు వాడాలి, మాస్క్ ధరించాలి అని సూచించారు.
ఇతర ప్రాంతాల వారికి బ్యాంకు అవసరాలు ఉంటే... వారంలో ఒక రోజున ఒక బ్యాంకు ఖాతాదారుడినే అనుమతిస్తామన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతర వ్యాపారాలకు ఇప్పుడున్న సమయాన్ని కుదిస్తున్నామన్నారు.ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఉన్న ఈ సమయాన్ని...మద్యాహ్నం 2 గంటలు వరకే పరిమితం చేస్తామన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి, ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణా రావు ఆదేశాలు మేరకు... యానాంలో రానున్న 3నెలలు కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'రాజమహేంద్రవరం నగరానికి స్మార్ట్ సిటీ హోదా వచ్చేలా కృషి చేస్తా'