తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నదీ పాయలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షం నీటితో ధవళేశ్వరం బ్యారేజీ నిండింది. దీంతో బుధవారం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు వదిలారు. ఈ నీటితో గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి నదీపాయలు జలకళను సంతరించుకున్నాయి.
కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామస్థులు రాకపోకలకు పడవలను ఆశ్రయిస్తున్నారు. వరదనీరు పెరగటంతో కోనసీమ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది.
ఇవీ చదవండి...