ETV Bharat / state

గ్రామాల వారీగా కరోనా పరీక్షలు.. నిర్థారణ అయితే ప్రభుత్వాస్పత్రికి తరలింపు - తూర్పుగోదావరి జిల్లా కేంద్ర పాలిత ప్రాంతం యానాం

కేంద్ర పాలిత ప్రాంతం యానాం పరిధిలో కరోనా పరీక్షల కోసం ప్రజలు రోజుల తరబడి వరుసలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ గ్రామాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

గ్రామాల వారీగా కరోనా పరీక్షలు.. నిర్థారణ అయితే ప్రభుత్వాస్పత్రికి తరలింపు
గ్రామాల వారీగా కరోనా పరీక్షలు.. నిర్థారణ అయితే ప్రభుత్వాస్పత్రికి తరలింపుగ్రామాల వారీగా కరోనా పరీక్షలు.. నిర్థారణ అయితే ప్రభుత్వాస్పత్రికి తరలింపు
author img

By

Published : Sep 25, 2020, 4:34 PM IST

యానాం పరిసర ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షల చేయాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. యానాంలో గ్రామాల వారీగా పరీక్ష నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది.. ప్రతిరోజు ఉదయం ఒక్కో గ్రామంలో ప్రతి ఒక్కరి నుంచి నమూనాలు సేకరించి 18 గంటల వ్యవధిలో ఫలితాలను తెలియజేస్తున్నారు.

బాధితులకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స..

పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. తక్షణం బాధితులను గుర్తించడం ద్వారా ఇతరులకు వ్యాప్తించకుండా అరికట్టే వీలవుతుందని యానం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు.

ఆస్పత్రిలో 150 మంది.. హోం ఐసోలేషన్​లో 98 మంది..

యానాంలో గడచిన 4 నెలల్లో ఆరువేల మందికి పరీక్షలు నిర్వహించగా 16 వందల మందికి వ్యాధి నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో 150 మంది.. హోమ్ ఐసోలేషన్​లో 98 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 1300 మంది కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరినట్లు వివరించారు. కొవిడ్ పాజిటివ్​తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో 41 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

భయపడాల్సిందేమీ లేదు : మంత్రి మల్లాది..

అత్యవసర కేసుల నిమిత్తం పదిహేను వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని పుదుచ్చేరి వైద్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. ప్రజలు భయపడాల్సిందేమీ లేదని.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన కొవిడ్ ప్రభావం.. ఇప్పుడు పల్లెల్లోనూ ఊహించని రీతిలో విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు వ్యాధి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

ఇవీ చూడండి : ప్రారంభోత్సవానికి ముస్తాబైన హైదరాబాద్ దుర్గంచెరువు 'కేబుల్ బ్రిడ్జి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.