ఎదురెదరుగా రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. విజయవాడ నుంచి ఒడిశా వెళుతున్న కారు, ఒడిశా నుంచి చింతూరు వస్తున్న వ్యాన్‌ను ఢీ కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కుయుగూరులోో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ కానూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భరతం సత్యనారాయణ, ఆయన భార్య హారతి మరణించారు.
సంక్రాంతి సెలవులకు స్వగ్రామమైన ఒడిశాలోని నవరంగపూర్‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం చింతూరులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో.. బ్యాంక్ ఉద్యోగి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన భార్య హారతిని భద్రాచలంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: