తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి వారు ఇవాళ కోదండరామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి,సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో హనుమద్వాహనంపై ఊరేగించారు.
ఇదీ చదవండి: ఫోటో ఫ్రేముల్లో... పెళ్లి జ్ఞాపకాలు బంధించేద్దాం..!