ETV Bharat / state

cm jagan flexi hulchul: 'జగన్ అన్న ఉన్నాడు.. జాగ్రత్త'.. బోర్డు కలకలం! - ఆంధ్రప్రదేశ్ వార్తలు

cm jagan flexi hulchul: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఓ బోర్డు కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు 'జగన్ అన్న ఉన్నాడు.. జాగ్రత్త' అంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఏముందంటే..?

cm jagan flexi hulchul, ROADS IN AP
జగన్ ఫ్లెక్సీ కలకలం
author img

By

Published : Dec 12, 2021, 11:08 AM IST

Updated : Dec 12, 2021, 12:02 PM IST

సీఎం జగన్ ఫ్లెక్సీ కలకలం

cm jagan flexi hulchul: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన తెలిపారు. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త' అంటూ... సామర్లకోట - వేమగిరి కెనాల్ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే దారిలో ఈ ఫ్లెక్సీ ఉంది. ఆ మార్గంలో వెళ్లే వారంతా ఫ్లెక్సీని ఆసక్తిగా గమనిస్తున్నారు.

'జగన్ అన్న ఉన్నాడు.. జాగ్రత్త' అనే ఈ బోర్డు స్థానికంగా కలకలం రేపుతోంది. రోడ్ల దుస్థితిని నిరసిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ఏర్పాటు చేశారు. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసేవరకు ఈ బోర్డును ఎవరూ తొలగించకూడదని... ఒకవేళ తొలగిస్తే వారు ఈ రోడ్డుపైనే పోతారని' పేర్కొంటూ అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే దారిలో బోర్డును ఏర్పాటు చేశారు.

రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఫొటో, పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలంగా మారింది. రోడ్ల పరిస్థితి ఇప్పటికైనా మారాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Kurnool district road problems: ఇసుక లారీల బీభత్సం.. గుంతలతో దర్శనమిస్తున్న పల్లె రోడ్లు!

Last Updated : Dec 12, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.