తూర్పు గోదావరి జిల్లా మామిళ్లగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి గుంటలో పడి మృతి చెందారు. పాఠశాలకు సెలవు కావటంతో ఊరి శివార్లలో ఉన్న కాలువలో కాసేపు సరదాగా చేపలు పట్టారు. అనంతరం స్నానం చేసేందుకు నీటి కుంటలో దిగి ఊపిరాడక మృతి చెందారు. వీరితో పాటు వచ్చిన మరో ఇద్దరు చిన్నారులు గ్రామస్థులకు ఈ విషయాన్ని తెలియజేయటంతో నీటిలో మునిగిపోయిన చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.
ఇదీ చూడండి: నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి