తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పాలగూడేనికి చెందిన కొమరం శ్రీను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రయోజనం కనబడలేదు. నాటువైద్యం కోసం శ్రీను తండ్రి.. బంధువు సాయంతో ద్విచక్రవాహనంపై పక్క గ్రామానికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుని బుధవారం ఇంటికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో శ్రీను ఇబ్బంది పడుతుండటంతో ఓ చెట్టు కింద వాహనాన్ని నిలిపి నీరు తాగిస్తుండగా.. ప్రాణాలు వదిలాడు. బాధను దిగమింగుకొని కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం