ETV Bharat / state

నూతన సంవత్సరానికి సమ్మెతో స్వాగతం: సీఐటీయూ - జనవరి 8న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మే

ఈ ఏడాది నూతన సంవత్సరానికి దేశవ్యాప్త సమ్మెతో కార్మిక సంఘాలు స్వాగతం పలుకుతున్నాయని... సీఐటీయూ నేతలు అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని... దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ నేతలు
author img

By

Published : Nov 19, 2019, 7:47 PM IST

నూతన సంవత్సరానికి సమ్మెతో స్వాగతం: సీఐటీయూ

తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో... అఖిల భారత అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఐటీయూ నేతలు హాజరయ్యారు. ఈ నూతన సంవత్సరానికి దేశవ్యాప్త సమ్మెతో కార్మిక సంఘాలు స్వాగతం పలకనున్నాయని సీఐటీయూ నేతలు పేర్కొన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లు అన్నీ ఈ సమ్మెలో పాల్గొంటాయని... సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత చెప్పారు. ప్రధాన పారిశ్రామిక రంగాలన్నీ సంక్షోభంలో చిక్కుకొని ఉద్యోగులను తొలగిస్తున్నాయని... హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం కార్మికులకు పింఛన్లు, స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న వివిధ వర్గాల మహిళలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఉత్సాహంగా అఖిల భారత అంగన్​వాడీ మహాసభలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.