తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు కోరంగి ఎస్సై వివరించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: గ్రామాల వారీగా కరోనా పరీక్షలు.. నిర్థారణ అయితే ప్రభుత్వాస్పత్రికి తరలింపు