తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో కొత్తగా13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలోని డ్రైవర్‌కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్థరణ కావటంతో... మొత్తం 40 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 13 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్థరించారు. ఈ 13 మందికి రెండో దఫా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
గత నెల 29న కరోనా లక్షణాలుతో మృతి చెందిన లారీ డ్రైవర్ మృత దేహానికి పరీక్షలు చేయనివ్వకుండా కుటుంబ సభ్యులు దహనం చేయడం వల్లే ఈ ముప్పు వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఆ గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఇదీ చదవండి: