రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. అర్హులకు పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు రద్దు చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. రద్దుల ప్రభుత్వం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో చక్రధరరావుకు అందించారు.
ఇవీ చూడండి: