జగన్ పాలనలో వైకాపా నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ఆరోపించారు. పేదలు, ప్రతిపక్షాలను అణగదొక్కడమే ప్రభుత్వ ఎజెండాగా ఉందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివిస్కు వ్యతిరేకమని చెప్పిన జగన్.... అధికారంలోకి వచ్చాక పరిశ్రమ భూముల్ని ఎంపీ విజయసాయిరెడ్డి బంధువులకు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు పోరాటం చేస్తుంటే.. వారిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ పరిశ్రమను నిలిపివేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి.