తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారిపై అత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత డిమాండ్ చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా నాయకులు జ్యోతుల నవీన్, పిల్లి అనంతలక్ష్మీ, మేయర్ పావనిలతో కలిసి ఆమె పరామర్శించారు. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యాచార ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని.. ముఖ్యమంత్రి జగన్, హోమంత్రి సుచరితలను అనిత ప్రశ్నించారు. దిశ చట్టం వచ్చిన తర్వాత రోజుకో చోట ఇలాంటి ఘటనలు జరగుతున్నా...చర్యలు లేవని విమర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించి చిన్నారి కుటుంబాని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
కాకినాడలో దారుణం... నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం