రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని జరిమానాలు పెంచటం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సంక్షేమం పేరుతో ఓ చేత్తో ఇచ్చి.. జరిమానాల పేరుతో మరో చేత్తో లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ వాహనాలు బయటకు తీయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. వర్షాలకు రోడ్లన్నీ పాడైతే ఒక్క రహదారికి మరమ్మతులు చేయకుండా జరిమానాలు పెంచడమేంటని నిలదీశారు. చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రవాణాపై అవగాహన పెంచాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆత్యాచారాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చినరాజప్ప ఆక్షేపించారు. వైకాపా కార్యకర్తలు నిందితులైతే పోలీసులే రాజీయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారంటూ డీజీపీ చెప్పిన మాటలు.. నీటిమూటల్లా మిగిలాయని విమర్శించారు.
ఇవీ చదవండి..