గోదావరి డెల్టా పరిధిలోని ధాన్యం విక్రయాల్లో రూ.1,500 కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం ధాన్యం అమ్ముకున్న తర్వాత మద్దతు ధర పెంచారని... దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అధికారులు, నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. ఈ అంశంపై కాకినాడ జాయింట్ కలెక్టర్ లక్ష్మి షా కు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!