తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని దేవాలయాలపై.. దుండగులు దాడి చేసి 23 విగ్రహాలను ధ్వంసం చేయడంపై.. భాజపా నేత పరిపూర్ణానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా... దేశరక్షణకు తూట్లు పొడిచేలా హిందూ ధర్మంపై దాడి జరిగిందని హైదరాబాద్లో ఆగ్రహించారు. సీఏఏపై గగ్గోలు పెడుతున్న నాయకులు.. 23 విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. అధికారులు చేపట్టిన దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ఈనెల 6న ధర్మజాగరణ దీక్ష చేపడుతామని తెలిపారు. విగ్రహాల ధ్వంసంపై ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనికి మతిస్థిమితం లేదని చెబుతున్నారని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ... మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: