సుబ్రమణ్య షష్ఠిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుబ్రమణ్య మాలధారులు భుజాన కావడి ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను గజ వాహన రథంపై ఊరేగించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాన్ని అనపర్తిలో ఏడేళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆందోళనలతో దద్దరిల్లిన దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రాంగణం