‘మా ప్రాథమిక ఆదర్శ పాఠశాలను జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సార్.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మా బడిని తరలించొద్దు’ అంటూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం విద్యార్థులు శుక్రవారం సీఎం జగన్‌కి లేఖలు రాశారు.
‘‘నాడు-నేడు’లో బడిని చక్కగా తీర్చిదిద్దారు. ఇప్పుడు తరలించడం భావ్యమా ? ఇక్కడ 253 మంది చదువుతుండగా.. 3 నుంచి ఐదో తరగతి చదువుతున్న 136 మందిని అర కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు తరలించనున్నారు’ అంటూ రాసిన పోస్టు కార్డులను చూపుతూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.
Mortgage: 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్' అభివృద్ధి కోసం.. నిబంధనలు గాలికి!