ETV Bharat / state

కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల ఆత్మహత్య... - కాకినాడలో భార్యాభర్తలు ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. అమ్మనాన్న ఫోన్ ఎత్తట్లేదని కుమార్తె ఇంటికి వెళ్లి చూసే సరికి ఇద్దరు విగత జీవులుగా పడిఉన్నారు.

Spouses commit suicide  at kakinada
భార్యాభర్తలు ఆత్మహత్య
author img

By

Published : Aug 11, 2020, 8:20 AM IST

కుటుంబ కలహాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ 49వ డివిజన్ రాజేశ్వరి నగర్​లో నివసిస్తున్న వల్లభాపురపు దుర్గాప్రసాద్, వెంకట పద్మావతి ఆదివారం అర్ధరాత్రి నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణ బాబు తెలిపిన వివరాల ప్రకారం...

దుర్గాప్రసాద్ గత సంవత్సర కాలంగా ఏ పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో .. భార్యాభర్తలిద్దరికి తరుచూ గొడవలు జరుగుతుండేవి. వెంకట పద్మావతి ఒక చిన్న బ్యూటీ పార్లర్ నడుపుతుండగా .. కరోనా వల్ల ఆ వ్యాపారం మందగించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇరువురి మధ్య తగాదాలు నెలకొన్నాయి. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం చేసి అత్తగారింటికి పంపారు. చిన్న కుమార్తె రాధిక కాకినాడ గ్రామీణ ఇంద్ర పాలెంలోని వారి అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. రాధిక సోమవారం ఉదయం ఫోన్ చేస్తే అమ్మనాన్న ఇద్దరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి.. చూసింది. తల్లి బెడ్రూంలో..తండ్రి వంట గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన చూసి ఒక్కసారిగా కుమార్తె బోరున విలపించింది.

ఇదీ చూడండి. పథకాల అమలుపై బ్యాంకుల ప్రతినిధులతో సీఎంవో అధికారుల చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.