son killed his father : పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన తనయుడే తండ్రి పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంతో.. స్నేహితుల సహకారంతో కన్నతండ్రిని హత్య చేశాడో కుమారుడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సఖినేటిపల్లి మండలం వి.వి. మెరకలో కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబకలహాలతో తండ్రి శేఖర్(55)ను తనయుడు శరత్ హత్య చేశాడు. స్నేహితుల సహకారంతో తండ్రిని తీవ్రంగా కొట్టాడు. అనంతరం గాయపడిన శేఖర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారు. ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: