తూర్పు గోదావరి జిల్లా మురుమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వార్ల నదీవిహారం ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామి, అమ్మవార్లకు ఈ కార్యక్రమం జరిపారు. జానపద కళాకారుల నృత్యాలు, కేరళ డప్పులు కోలాహలం మధ్య నంది వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్, దేవస్థానం కమిటీ సభ్యులు గోదావరికి పూజలు చేసి పంచ హారతులు ఇచ్చారు. అనంతరం హంస వాహనంపై స్వామివారి అమ్మవార్లు నదీవిహారం చేశారు.