తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 120 మంది కార్మికులు 220 గ్రామాలలో నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు.
ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తమకు వేతనాల బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: