ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన కారు...కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు - road accident at rajanagaram mandal

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్​ను కారు ఢీకొన్న ఘటన తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు
కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు
author img

By

Published : Jun 30, 2020, 1:20 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్​చెరువు గ్రామంలో అనిల్​కుమార్ అనే కానిస్టేబుల్​ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్​ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.

బొమ్మూరు స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న అనిల్​కుమార్... సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఆటోనగర్​కు వచ్చేసరికి జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు..అతడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావటంతో అతన్ని స్థానికులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి: 'శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.