తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ , సూరంపాలెం జలాశయాలలోకి నీరు వచ్చి చేరింది. ఫలితంగా... జలాశయాలు నిండుకుండలా మారాయి.
204 మీటర్ల సామర్ధ్యం కలిగిన భూపతిపాలెం జలాశయంలోకి 200 మీటర్ల నీరు వచ్చి చేరడంతో మంగళవారం ఉదయం 200 క్యూసెక్కుల నీటిని దిగువున ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. అలాగే వర్షంతో కొండ వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో కొన్ని గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: