తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కొండపై ఉన్న హరిహర సదన్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. ఈ క్వారంటైన్ సెంటర్‌కు 103 మందిని తరలించి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. వీరిలో అత్యధికులు విద్యార్థులే. వీరంతా విజయనగరం, విశాఖ జిల్లాకు చెందిన వారున్నారని అధికారులు వెల్లడించారు. వసతి గృహాలు మూసివేయటంతోనే వీరందర్నీ ఇక్కడకు తీసుకొచ్చామనీ, 14 రోజులు క్వారంటైన్‌లోనే ఉంచి, తర్వాత వారి స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించినట్లు వివరించారు. వీరెవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవనీ ఎవరూ భయపడవద్దని ఎంపీడీవో రాంబాబు స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య కార్మికల ఆందోళన..
క్వారంటైన్‌కు 103 మందిని తరలించటంపై దేవస్థానం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని టోల్గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు భరోసా ఏంటని కార్మిక సంఘ నాయకులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నాడి పట్టేదీ వారే... బువ్వ పెట్టేదీ వారే..!