రోడ్డుపై దొరికిన పర్సును బాధితుడికి అప్పగించి మానవత్యం చాటుకున్నారు కొత్తపేటకు చెందిన నలుగురు వ్యక్తులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో రోడ్డు పక్కన పడివున్న పర్సును చెందిన బూసి భాస్కరరావు, గంగుమళ్ళ రాజు, బయ్యే రాంబాబు, పితాని చిన్నాలు చూశారు. అందులో రూ. 30 వేల నగదు, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లెసెన్స్ను గుర్తించారు. వాటి ఆధారంగా ఊబలంక గ్రామానికి చెందిన నాగబాబు పర్సుగా తెలుసుకున్నారు. ఆ చిరునామా ఆధారంగా అతని ఇంటికి వెళ్లి అందించారు.
ఇదీ చదవండి :