ETV Bharat / state

కాకినాడ పెద్దాసుపత్రిలో ప్రసవ వేదన..!?

ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తున్న గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో అడుగుపెట్టింది మొదలు... తిరిగి ఇంటికి వెళ్లే వరకూ సమస్యలతో సతమతమవుతున్నారు. నగదు చెల్లించి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ప్రభుత్వాసుపత్రులు... నరకం చూపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కథనం.

కాకినాడ ప్రభుత్వాసుపత్రి
author img

By

Published : Jun 1, 2019, 6:26 AM IST

కాకినాడ ప్రభుత్వాసుపత్రి

కాకినాడ ప్రభుత్వాసుపత్రి... ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ శివారు ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తోంది. నిత్యం వేలమంది రోగులతో రద్దీగా ఉండే ఈ ఆస్పత్రిలో 40 విభాగాలున్నాయి. కీలకమైన ప్రసూతి విభాగానికి గర్భిణులు ప్రసవం కోసం పెద్దసంఖ్యలో వస్తుంటారు. రోజుకు దాదాపు 60మంది ప్రసవిస్తుంటారు. ప్రసవం తేదీ దగ్గర పడిన గర్భిణులు ముందుగానే ఆస్పత్రిలో చేరతారు. అందరికీ సరిపడ పడకల్లేక... ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తల్లీపిల్లల విభాగంలో బాలింతలను ఉంచుతున్నారు. ఇక్కడ ప్రతి పడకపై ఇద్దరు బాలింతలతోపాటు పుట్టిన శిశువులు ఉండాల్సి వస్తోంది. కొన్ని పడకలపై ముగ్గురు బాలింతలు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మండువేసవిలో చిన్న పడకపై వీరు పడుతున్న అవస్థలు చెప్పలేని పరిస్థితి. శస్త్రచికిత్స చేయించుకున్నవారి బాధలు వర్ణణాతీతం. గాలి తగలక... ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గదులు ఇరుకుగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చే ఫ్యాన్లు వినియోగించుకోలేకపోతున్నారు.

ఇబ్బంది వాస్తవమేనని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు అంగీకరించారు. ఆస్పత్రికి మంచి పేరు ఉన్న కారణంగా 3జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారని ఎవరినీ వెనక్కి తిప్పి పంపలేకపోతున్నామని వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం అందుబాటులోకి వస్తే సమస్యలుండవని తెలిపారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనీసం కూర్చునేందుకూ ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, బాలింతల కోసం విశాలమైన గదులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండీ...

కొత్త ప్రభుత్వ పథకాలేంటీ... అమెరికా విద్యార్థుల ఆరా

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ మైలారి శోభారాణి అధ్యక్షత వహించారు. తాగునీటి సమస్య పై స్పందించారు. యుద్ధప్రాతిపదికన కొత్త పాయింట్లు వేసి నీటి సరఫరా చేస్తున్నామని కమిషనర్ కాసు శివరామిరెడి తెలిపారు. సమస్యలపై చర్చించారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.