లాక్డౌన్తో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కపూట అన్నం కోసం అలమటిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు కారణంగా ఆహార పంపిణీకి దాతలు ముందుకు రావటం లేదు. దీనివల్ల చాలా మంది పేదలు కొళాయి నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. ఒకరో ఇద్దరో దాతలు పంచే ఆహారం కోసం పేదలు పరుగులు పెడుతున్నారు. ముందు వెళ్లిన వారికి భోజనం దొరుకుతుంటే... మిగిలిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఇదీ చదవండి