తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన కావలి ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై విశాఖపట్నంలోని చింతపల్లి నుంచి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావటంతో రావులపాలెంలో జాతీయ రహదారిపై తనిఖీలు చేసి అతనిని పట్టుకున్నారు. తొమ్మిది కేజీల గంజాయి ఉన్నట్లు ఎస్సై బుజ్జి బాబు తెలిపారు.
ఇదీ చూడండి