తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. రావులపాలెం సీఐ బి. కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సైలు బుజ్జి బాబు, శ్రీనివాస్ నాయక్, సురేంద్ర, నరేష్, సిబ్బంది గ్రామాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు.. జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండీ.. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు