రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయాణికులు వందల సంఖ్యలో తరలివచ్చారు. గతంలో ఈ రైలు తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి స్టేషన్లలో ఆగేది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఒక్క స్టేషన్లోనే ఆగేందుకు అనుమతినిచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ నిడదవోలు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో హాల్ట్ తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఉభయగోదావరి జిల్లాల ప్రయాణికులు రాజమహేంద్రవరం స్టేషన్‌కు వందల సంఖ్యలో తరలివచ్చారు. స్టేషన్ వద్ద లైన్లలో ప్రయాణికులు బారులు తీరారు.
ఇదీ చదవండి: సాంకేతిక అనుమతులు లేనివన్నీ.. కొత్తవే: కృష్ణా బోర్డు