తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం మాచవరంలో ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డిని ఎమ్మెల్యే, ఎంపీ చింతా అనురాధలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే వివరించారు.
ఇదీ చదవండి :