తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తీర ప్రాంతాలైన ఐ పోలవరం, భైరవపాలెం, తీర్థాలమొండి, కాట్రేనికోన మండలంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు..మద్యం ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు. కరోనాకు ముందు రూ. 45 ఉండే బాటిల్ ఇప్పుడు రూ. 185 లకు ప్రభుత్వం పెంచడంతో మద్యానికి అలవాటుపడ్డ వారంతా నాటుసారా వైపు పరుగులు పెట్టడంతో డిమాండ్ బాగా పెరిగింది.
యానం, ఐ పోలవరం, కాట్రేనికోన పోలీసులు, ముమ్మడివరం డివిజన్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు లక్ష లీటర్ల వరకు నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లంఊటను, 20 వరకు పొయ్యిలను ధ్వంసం చేశారు. దీనినిబట్టే నాటుసారా తయారీ ఏ రేంజ్ లో ఉందో గ్రహించవచ్చు.
ఇదీ చదవండి కరోనాపై పోరుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ భార్య సిద్ధం