కుమారుడు మాట్లాడటం లేదని మనస్థాపంతో ఓ వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన మోరుల చిన్నయ్య(73) అనే వృద్ధుడికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు రోజులుగా ఓ కుమారుడు తనతో మాట్లాడటం లేదనే మనస్థాపంలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. చిన్నయ్య.. పి.గన్నవరం అక్విడెక్ట్ పైనుంచి గోదావరిలోకి దూకాడు. వరద నీటిలో సుమారు అర కిలో మీటర్ మేర కొట్టుకుపోయాడు. ఆ సమీపంలో ఇసుక తీస్తున్న బోటు నిర్వహకుడు సికిలే ఏసు .. చిన్నయ్యను గుర్తించి రక్షించారు. తన భార్య గతేడాది డిసెంబర్లో మరణించిందని చిన్నయ్య తెలిపాడు.
ఇదీ చదవండి