ETV Bharat / state

ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. భయాందోళనలో స్థానికులు - kesanapalli latest news

ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. ప్రమాదవశాత్తు ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి ముడిచమురు లీక్ అవ్వడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

oil tanker overturned
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
author img

By

Published : Aug 4, 2021, 7:36 PM IST

ఆయిల్ ట్యాంకర్ బోల్తా... భయాందోళనలో స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం కేసనపల్లిలో ప్రమాదవశాత్తు ఓఎన్జీసీ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గొల్లపాలెం ఓఎన్జీసీ వెస్ట్ స్ట్రక్చర్ బావి నుంచి తాటిపాక రిఫైనరీకీ ముడి చమురు తరలిస్తున్న ట్యాంకర్.. కేసనపల్లిలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది.

ఆయిల్ ట్యాంకర్ నుంచి ముడిచమురు లీక్ అవ్వడం గమనించిన.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలానికి మలికిపురం ఎస్సై నాగరాజు, ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

king cobra: వామ్మో.. కింగ్ కోబ్రా ఎంత పెద్దగా ఉందంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.