తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డులకు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలేదు. పాత భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. కానీ వాటికి తాళాలే దర్శనమిస్తున్నాయి. మొత్తం 20 ఉండగా... 10 వార్డులకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాలను వినియోగిస్తున్నారు. వార్డు వాలంటర్ల ద్వారా ఇంటికే చేరాల్సిన సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వృద్ధులు పింఛన్ల కొరకు వెళ్తే... సాంకేతిక కారణాలతో చెబుతున్నారు. ఒక్కో కార్యాలయంలో 10 మంది సిబ్బంది ఉండాలి... కానీ ఇద్దరు, ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఫలితంగా పనికోసం వచ్చినవారు... వెనుదిరుగుతున్నారు.
ఇదీచూడండి.కాకినాడలో అమరావతి కోసం ఐకాస నిరసన