మహిళలపై వేధింపులను నిరసిస్తూ... రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నారీ - భేరీ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలవూడి అనిత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, మాజీ మంత్రి జవహర్, ఇతర నాయకులు హాజరయ్యారు.
మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు... పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అనిత ఆరోపించారు. గత 17 నెలలుగా మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయని, ముఖ్యమంత్రే స్వయంగా నగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించినప్పటికీ... మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే భవానీ అన్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: