తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్యాగరాజు నారాయణదాసు సేవా సమితి సమావేశ మందిరంలో కమలాకర్ వైభవం పేరిట ప్రత్యేక సంగీత విభావరి ఘనంగా ప్రారంభమైంది. ఈ సంగీత విభావరి ఈ నెల 7వ తేది వరకు కొనసాగనుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వి.కమలాకర్ రావు ఈ రంగంలో ప్రవేశించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత కళాకారులు ప్రదర్శించిన వివిధ కచేరీలు శ్రోతలకు వీనులవిందు చేశాయి.
ఇదీచదవండి