యానాం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి థామస్ ఎన్నికల నిర్వహణ కోసం అక్కడి పరిస్థితిని పరిశీలించి వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఇవాళ సమావేశమయ్యారు. గతంలో యానాం మున్సిపాలిటీలో 10 వార్డులుండగా..పెరిగిన జనాభా ఆధారంగా 14 వార్డులుగా విభజించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా 500 నుంచి 700 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్ర ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
పదేళ్ల తర్వాత..
దాదాపు పది సంవత్సరాల తర్వాత కేంద్ర పాలిత పుదుచ్చేరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చెన్నై హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రంగస్వామి ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రానున్న మూడు నెలల్లో ఎన్నికల నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
సంక్షేమ పాలన అందిస్తా..
గత ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించని కారణంగా అభివృద్ధి ఆగిపోయిందని ముఖ్యమంత్రి రంగస్వామి అన్నారు. ఈ సారి ఎన్నికలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి
Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం