తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వే బ్రిడ్జి కింద ముంపు పరిస్థితిని ఎంపీ భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు, రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటంపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిపై ఉన్న హేవలాక్ వంతెనను రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కి ఇచ్చేలా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో చర్చించామని ఎంపీ తెలిపారు. దీనికి బదులుగా కొవ్వూరులో కొంత భూమిని రైల్వేశాఖ అడిగినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి.