కన్న కుమారుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు... నయమై త్వరలోనే ఇంటికి వస్తాడు అని అనుకుందా తల్లి... కానీ ఆ తల్లి ఆశలు అడియాసలు చేస్తూ... అమ్మా ఇక సెలవంటూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. నీవు లేని జీవితం నాకొద్దు కన్నా అని ఆ తల్లీ ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నెయిలీపేటలో జరిగింది.
ఏలేశ్వరం నెయిలీపేటకు చెందిన సీతారాం అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... గురువారం రాత్రి మృతిచెందాడు. కుమారుని మరణ వార్త విన్న తల్లి మంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారులు చనిపోవటంతో కుటుంబ సభ్యుల వేదన అంతాఇంతా కాదు.
ఇదీ చదవండి: పెనికేరు గ్రామంలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు