రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద ఉన్న రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సందర్శించారు . గోదావరికి వరద నీరు పొటెత్తడంతో మంచినీటి శుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుందో అని పరిశీలించినట్లు చెప్పారు. వరద నీటిలో మట్టి, ఆకులు, ఇతరత్రా కొట్టుకు వస్తాయని... శుద్ది ప్రక్రియ సక్రమంగా ఉంటేనే ప్రజలకు మంచినీరు అందుతుందని తెలిపారు. ప్రక్రియ అంతా సక్రమంగానే జరుగుతోందని భవాని చెప్పారు.
ఇదీ చదవండి