తూర్పు గోదావరి జిల్లా రావులపాడులోని ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల క్రితం ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారులు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నారులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సుమారు 28 కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా రావులపాడులోని కాలువ పక్కన గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. కాలువలో పడిఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్