వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనే ఉంటుంది కానీ... పోవడం ఉండదని మంత్రి పేర్నినాని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఒప్పంద కార్మికులు ఎక్కడికీ పోరని... విపక్షాలే అసత్య ప్రచారాం చేస్తోందని పేర్కొన్నారు. వలస కార్మికులు రేపటినుంచి ఇక రోడ్లపై సంచరించరని.. వారిని పునరావాస కేంద్రాలకి తరలించి అక్కడ నుంచి స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు. గత కొంతకాలం క్రితం రహదారి ప్రమాదంలో చనిపోయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాత్రికేయులు తాతాజీ, మురళి కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయల చెక్కును అందించారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్ సడలింపులపై మరోసారి ప్రభుత్వ ఆదేశాలు