తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో రైతు భరోసా కేంద్రం ఎదుట ఉపాధి హామీ కూలీలు ధర్నాకు దిగారు. వారమంతా కష్టపడి పనిచేస్తున్నా.. రూ. 500 నుంచి 600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇంటివద్ద ఉండి పని చేయకపోయినా కొంతమందికి వారానికి రూ. 1500 నుంచి 1600 ఇస్తుండటంపై కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి పని చేయకున్నా.. మస్టర్లలో పని కల్పించినట్లు నమోదు చేసి లక్షలాది రూపాయల అవినీతికి ఫీల్డ్ అసిస్టెంట్ పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరికి గ్రామ వైస్సార్సీపీ నాయకులు బుద్దరాజు చంటిరాజు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్‌ని విధుల నుంచి బహిష్కరించాలని చంటిరాజు డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్న ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని కూలీలు కోరారు.
ఇదీ చదవండి: '108 అంబులెన్స్ రాకపోవడంతో.. ఆటోలో ఆస్పత్రికి'