మావోయిస్టుల(Maoists)కు డబ్బులు చేరవేస్తున్న ముగ్గురు కొరియర్లను తూర్పుగోదావరి జిల్లా (east godavari district) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు.. చింతూరు మండలం గొరెలగూడెం వద్ద స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చింతూరు డీఎస్పీ ఖాదర్ బాషా వెల్లడించారు. 'మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్నారని ఎస్పీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు గొరెలగూడెం వద్ద తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం. వారి వద్ద నుంచి రూ. 9.73 లక్షలు పట్టుబడ్డాయి. వీటిపై ఆరా తీయగా.. స్థానికంగా ఉన్న పలువురు గుత్తేదారుల నుంచి వసూళ్లు చేసినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు.. కొరియర్లు ఆ డబ్బులను వారికి చేరవేసేందుకు బయల్దేరారు. మందుగుండు సామాగ్రి కొనుగోళ్ల కోసం ఈ డబ్బులను తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. కేసు నమోదు చేసి కొరియర్లను అరెస్ట్ చేశామని' ఆయన వివరించారు.
ఇదీ చదవండి