తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం క్వారీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైతన్య కాలనీకి చెందిన గెద్దాడ శివ అనే వ్యక్తి క్వారీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.
నిన్న సాయంత్రం స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు